Inspirational Story: 12 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయి... కష్టాలను దాటుకుంటూ... పోస్ట్‌మాస్టర్‌గా
చదవండి: అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా...
వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన గడ్డం సుమలత, మద్దిరాల ప్రసాద్‌ల ఏకైక కుమార్తె సుప్రియ. దురదృష్టవశాత్తు 2013లో మిద్దె కూలిన ఘటనలో తల్లి సుమలత మరణించగా.. 2016లో తండ్రి ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
తల్లిదండ్రులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోయినా సుప్రియ మాత్రం ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించింది. మేనమామ గడ్డం ఓబులేసు సంరక్షణలో ఉంటూ రాజుపాలెం మండలం వెల్లాల గురుకుల పాఠశాలలో 10 వ తరగతి వరకు చదివింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 594 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌లలో ఒకరిగా నిలిచింది.
చదవండి: టీవీ మెకానిక్ కూతురు... తొలి ముస్లిం ఫైటర్ పైలట్
కర్నూలు జిల్లా బనగానపల్లెలోని కంకర గురివిరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్‌లో బైపీసీ గ్రూపు తీసుకుని అందులోనూ సత్తా చాటింది. 1000 మార్కులకు 952 మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు పొందింది. 2022 జూన్ లో పోస్టల్‌శాఖ విడుదల చేసిన ఫలితాల్లో సుప్రియ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. నంద్యాల పోస్టల్ డివిజన్ లోని బురుజుపల్లె పోస్టాఫీసులో బీపీఎంగా విధుల్లో చేరింది.
చదవండి: ఈ వంటలక్క ఆదాయం... కోటిపైనే ...
జీవితంలో ఎప్పుడు ఓటమి ఒప్పుకోకూడదని సుప్రియ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. 12 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయినా దిగులు చెందక ఆమె వేసిన ముందడుగు ఎంతో మందికి స్ఫూర్తి. ఎంతో మంది అనాథలు సుప్రియను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.