Skip to main content

Kasturba Vidyalayas: కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీ ప‌డుతున్న కస్తూర్బా విద్యాలయాలు

ఉన్నత విద్యా ప్రమాణాలు ... ఆహ్లాదకర వాతావరణం... ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఇలా ఎన్నో సౌకర్యాలతో కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలపించే కస్తూర్బా విద్యాలయాలు బాలికలకు వరంగా మారాయి. అత్యంత భద్రతతో కూడిన వసతి సదుపాయాలు కల్పిస్తుండడంతో బాలికలు అత్యధిక శాతం వీటిల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యాలయాల్లో సాధారణ విద్యతోపాటు కంప్యూటర్‌ శిక్షణ, యోగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Kasturba Vidyalayas
కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీ ప‌డుతున్న కస్తూర్బా విద్యాలయాలు

బాపట్ల అర్బన్‌: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన వారు, ఆర్థిక స్థోమత లేనివారు, చదవాలని ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించని వారు, ఎంతో మంది బాలికలు గతంలో చదువుకు దూరమయ్యేవారు. అలాంటివారు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2005లో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇంటర్మీడియెట్‌ వరకు స్థాయి పెంచారు. అలాగే మనబడి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా సౌకర్యాలు మెరుగుపరచడంతో కేజీబీవీలో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు.

ఇవీ చ‌ద‌వండి: APPSC & TSPSC Group 1 & 2 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు.. నేను చెప్పే స‌క్సెస్ ఫార్ములా ఇదే..

బాపట్ల జిల్లాలో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. 6 నుంచి 10 వరకు ప్రతి తరగతికీ 40 మంది విద్యార్థులు ఉంటారు. నాలుగు పాఠశాలల్లో కలిపి ప్రస్తుతం వెయ్యి మంది చదువుతున్నారు. 2019 నుంచి బాపట్ల జిల్లాలోని నాలుగు కేజీబీవీల్లోనూ ఇంటర్‌ తరగతులను ప్రారంభించారు. ఎంపీసీ, బైపీసీ లాంటి ప్రధాన కోర్సులతోపాటు సీఈసీ, వృత్తివిద్య ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సును ప్రవేశపెట్టారు. బోధనకు సీఆర్టీ, పీజీటీ, పీఈటీ ఒకేషనల్‌ పోస్టులు ఇటీవల భర్తీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా డిజిటల్‌ విద్యను బోధిస్తున్నారు. ఈ వసతి ప్రస్తుతం జిల్లాలోని ఏ కార్పొరేట్‌ పాఠశాలలోనూ లేదు.

జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో గతేడాది 150 మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయగా, 145 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14 మందికి 500 మార్కులకుపైగా వచ్చాయి. జిల్లా స్థాయిలో జగనన్న ఆణిముత్యాల ద్వారా చీరాల కేజీబీవీ బాలిక మొదటి బహుమతి రూ. 50 వేలు గెలుచుకున్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌ విభాగంలో చినగంజాం, బల్లికురవ కేజీబీవీలో చదువుతున్న బాలికలు మొదటి బహుమతులు అందుకున్నారు.

ఇవీ చ‌ద‌వండి: ఆమె మాట‌లే స్ఫూర్తి.. ఫైనాన్షియల్‌ లిటరసీతో మ‌హిళ‌ల‌ను మార్చేస్తున్న అనన్య పరేఖ్‌

kgvb

కేజీబీవీల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వాచ్‌మెన్‌లు, వంట మనుషులు అంతా మహిళలే ఉంటారు.
ఉచిత భోజనం(పౌష్టికాహారం) అందిస్తారు. వసతి కల్పిస్తారు.
యూనిఫామ్‌, షూ, దుప్పట్లు అందజేస్తారు.
కరాటే శిక్షణతోపాటు ఇంగ్లిష్‌ గ్రూప్‌ డిస్కషన్‌, డాన్స్‌, చిత్రం లేఖనం యోగా, స్వయం ఉపాధి కోర్సులూ నిర్వహిస్తున్నారు.
కంప్యూటర్‌ విద్య అందిస్తున్నారు.
బాలికా సాధికారత క్లబ్బులు ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్‌ హైజిన్‌ కిట్లు (ఆరోగ్య పరిశుభ్రత కిట్లు) అందజేస్తున్నారు.
అల్లికలు, చీరలకు ఎంబ్రాయిడింగ్‌ వేయడం, మగ్గం వర్క్‌, కుట్టు శిక్షణ, కమ్మెలు, గాజుల తయారీలోనూ తర్ఫీదు ఇస్తున్నారు.
ఒకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ద్వారా సమగ్ర శిక్ష తరఫున ఐటీ, బ్యూటీ వెల్నెస్‌, అప్పారెల్‌ కోర్సులు జరుగుతున్నాయి.
మీరు ఇంటర్‌ అయ్యాక ఒక సంవత్సరం డిగ్రీ కోర్సు కంప్లీట్‌ చేస్తే గవర్నమెంట్‌ జాబ్స్‌కి అర్హులు. ఫలితంగా విద్యార్థులు ఆనందంగా చదువు సాగిస్తున్నారు.

☛ ఆరేళ్ల క‌ష్టానికి ఫ‌లితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే...

bapatla student

ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నా
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం చాలా బాగుంది. నేను ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న. స్కూల్లో ఇంటి వాతావరణం ఉంటుంది. రోజూ ఉదయం యోగా చేయిస్తున్నారు. పాఠ్యాంశాలు చాలా చక్కగా చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాల్లో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తున్నారు. భోజనం కూడా చాలా బాగుంది.
– మేదబలిమి కళ్యాణి, పదో తరగతి విద్యార్థిని, చిన్నగంజాం కేజీబీవీ

 చంద్రుడిపై చంద్రయాన్‌–3 అడుగు నేడే

bapata teacher

బాలికలకు ఉజ్వల భవిష్యత్తు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా పాఠశాలలో చదివిన బాలికలకు విద్యతోపాటు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. జీవనోపాధికి అవసరమైన శిక్షణ అందిస్తున్నాం. బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా శిబిరాలు నిర్వహిస్తున్నాం. గతేడాది పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించాం.
– ఎం.చారులత, అసిస్టెంట్‌ గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా

Published date : 23 Aug 2023 01:43PM

Photo Stories