Education News: 100 కోట్లతో మూడు పాలిటెక్నిక్ కాలేజీలు... ఎక్కడెక్కడంటే
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: యువతకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
విద్యార్థులకు తగ్గనున్న భారం...
నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
చదవండి: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది... పరీక్ష ఎప్పుడంటే
రూ.100 కోట్లతో....
కాలేజీల ఏర్పాటు ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మెరుగుపడడంతో పాటు చదువు పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని బుగ్గన తెలిపారు. సుమారు ఒక్కో కాలేజీకి రూ.30 కోట్ల ఖర్చు చేయనున్నారు. మూడు కాలేజీలకు రూ.100 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనాలు వేశారు.
Published date : 21 Mar 2023 12:36PM