Skip to main content

AP Exams: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది... ప‌రీక్ష ఎప్పుడంటే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త విద్యా మండ‌లి వివిధ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల కోసం నిర్వ‌హించే అర్హ‌త ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఏపీ పీజీఈసెట్‌, లా సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌, పీజీసెట్‌ల షెడ్యూల్‌ను మండలి చైర్మ‌న్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.
Students

ఏపీ పీజీఈసెట్ (AP PGECET) షెడ్యూల్ 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పీజీఈసెట్‌-2023 ఎగ్జామ్ మే 28, 29, 30వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇందులో వ‌చ్చే ర్యాంకే ఆధారం.
పూర్తి నోటిఫికేష‌న్ వివ‌రాలు ఇలా...
- ఈ నెల 19వ తేదీ ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్
-  మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. 
- రూ. 5 వేల‌ లేట్ ఫీజుతో మే 14వ తేదీ వరకు ద‌రఖాస్తు చేసుకునేందుకు వీలు
- మే 15 నుంచి 16వ తేదీ వరకు స‌వ‌ర‌ణ‌లు చేసుకోవ‌చ్చు.
- మే 22వ తేదీ నుంచి హాల్ టిక్కెట్స్ డౌల్ లోడ్ చేసుకోవ‌చ్చు.
- మే 28,29,30 తేదీలలో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

లా సెట్ షెడ్యూల్ ఇలా (AP LAW CET)
- మార్చి 21న లా సెట్ నోటిఫికేషన్ విడుదల
- మార్చి 23 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఆన్ లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
- రూ. 2వేల ఆల‌స్య రుసుంతో మే 6వ తేదీ వరకు దరఖాస్తుకి అవకాశం
- మే 7,8వ తేదీల్లో కరెక్షన్స్ 
- మే 15వ తేదీ నుంచి హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్
- మే 20వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి‌ 4.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

ఏపీ ఎడ్ సెట్(AP EDCET) షెడ్యూల్
ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఆంధ్రప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే బీఈడీ తప్పనిసరి. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్-2023 ప‌రీక్ష మే 20న నిర్వ‌హించ‌నున్నారు.
పూర్తి వివ‌రాలు ఇలా.... 
- మార్చి 22న ఎడ్ సెట్ నోటిఫికేషన్
- మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవ‌చ్చు.
- రూ.2 వేల‌ లేట్ ఫీజుతో మే 10వ తేదీ వరకు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు.
- మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తులో స‌వ‌ర‌ణ‌లు చేసుకునేందుకు అవకాశం ఉంది.
- మే 12వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.
- మే 20వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఆన్ లైన్ లో పరీక్ష నిర్వ‌హిస్తారు.

ఏపీ పీఈసెట్ (AP PECET)
రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ పీఈసెట్ నిర్వ‌హిస్తారు. 
పూర్తి వివ‌రాలు ఇలా...
- మార్చి 18వ తేదీ నోటిఫికేషన్
- మార్చి 23 నుంచి మే 10వ తేదీ వరకు ద‌రఖాస్తుల స్వీకరణ
- రూ. వెయ్యి ఆల‌స్య రుసుంతో మే 18 నుంచి 24వ తేదీ వరకు ద‌రఖాస్తుల స్వీకరణ
- మే 27వ తేదీ నుంచి హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్
- మే 31వ తేదీ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 

ఏపీ పీజీ సెట్ (AP PGCET)
- మార్చి 29న నోటిఫికేషన్
- ఏప్రిల్ ఒకటి నుంచి మే 11వ తేదీ వరకు ద‌రఖాస్తుల స్వీకరణ
- రూ. వెయ్యి లేట్ ఫీజుతో మే 31వ తేదీ వరకు ద‌రఖాస్తుకి అవకాశం
- జూన్ ఒకటిన హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్
- జూన్ 6 నుంచి‌ 10 వరకు పీజీసెట్ పరీక్షలు

Published date : 21 Apr 2023 01:49PM

Photo Stories