Skill Development Course: స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో శిక్షణ.. వీళ్లు అర్హులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 2 నుంచి 6 విభాగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు.
Below Salary: దేశంలో 68 శాతం మంది జీతం.. రూ.20 వేల లోపే!!
ఇందులో ఎలక్ట్రికల్ క్యాడ్, ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోల్(పీఎల్‌సీ), సాలిడ్ ఎడ్జ్, కంప్యూటర్ న్యూమ రికల్ కంట్రోల్ ప్రోగ్రామింగ్(సీఎన్‌ఎల్‌పి), రివీట్ ఆర్కిటెక్చర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోర్సులు డిప్ల మో, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు స్కిల్స్ ను పెంపొందించుకునేందుకు దోహదపడతాయని తెలిపారు.
Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్..
90 గంటల కాలవ్యవధితో శిక్షణ ఇచ్చే ఈ కోర్సులకు ఒక్కోదానికి రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి సాంకేతిక విద్యాశాఖ సర్టిఫికెట్లను అందజేస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఐఆర్‌జీ ల్యాబ్ ఇన్‌చార్జ్ కమల్‌ను 99851 29995లో సంప్రదించాలని కోరారు.
Tags
- Skill Development Courses
- Free Skill Development Courses
- Skill Development
- Skill Development Programs
- Skill Development Training
- Polytechnic College
- polytechnic colleges
- government polytechnic colleges
- training program
- training programme
- TirupatiEducation
- SkillDevelopment
- YDwarkanathaReddy
- SVGovernmentPolytechnic
- PolytechnicTraining
- VocationalEducation
- DepartmentalCourses
- September2
- KTroad
- CareerGrowth
- skilltrainings
- SakshiEducationUpdates