Skip to main content

High court : ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఆన్​లైన్​ క్లాసులు చెప్పండి.. అలాగే స్కూల్స్‌, కాలేజీల‌కు..

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా.. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Schools
Schools and Collges

తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు, ఆన్​లైన్​ క్లాసులు కూడా చెప్పాల‌ని కీల‌క ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది.  ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాస నం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  కరోనాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సమ్మక్క, సారక్క జాతరలో కూడా కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telangana High Court

కరోనా పరిస్థితులపై ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది. కోవిడ్​ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తెలంగాణోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జ‌న‌వ‌రి 17 నుంచి ఈ జ‌న‌వ‌రి 31వ తేదీ వరకు సెలవులను పొడిగించింది కూడా. . అయితే ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్ధులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేప‌థ్యంలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలను పున: ప్రారంభించింది. దీంతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులను కూడా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల కారణంగా విద్యార్ధులకు పాఠాలు సరిగా అర్ధం కాలేదని ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలతో తెలిసిపోయిందని విద్యా వేత్తలు వాదిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల కంటే ఎక్కువగా ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.

పిల్లలకు చికిత్స కోసం ..

పిల్లలకు చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్ప త్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు వివరిం చారు. మేడారం జాతరలో ప్రభుత్వం కోవిడ్‌ జాగ్రత్తలన్నీ తీసుకుంటుందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందునే విద్యా సంస్థలను తెరిచా మని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యా సంవత్సరం నష్టపో కుండా చర్యలు తీసుకున్నామంటూ విద్యా శాఖ విడిగా నివేదిక అందజేసింది. కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 28న జరిగే విచారణ నాటికి అందించాలని ధర్మాసనం ఆదేశించింది. 

హాజరు శాతం స్వల్పమే.. అయినా కూడా..
కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌ తిరిగి ప్రారంభమయ్యాయి.ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ థర్మల్‌ స్క్రీనింగ్, మాస్క్‌ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. 

Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంత‌కి స్కూల్స్‌ జ‌రిగేనా..?

TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 04 Feb 2022 01:34PM

Photo Stories