Teachers: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది
నాగర్‌కర్నూల్: చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల జీవితాల్లో రంగుల వెలుగులు నింపి వారి సంపూర్ణ ఎదుగుదలకు ఉపాధ్యాయులు అక్షరాలతో రంగులు వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు అన్నారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా పండిత పరిషత్ ఉపాధ్యాయులు డీఈఓ గోవిందరాజులుకు రంగులు పూస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఏ రకమైన వృత్తిలో రాణించాలన్నా ఆ వ్యక్తిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని అన్నారు. విద్యార్థులకు చదువు నేర్పించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా సిద్ధం చేయడమే కాకుండా జీవితం అనే చదువును సప్త రంగులద్దుతూ నేర్పించాలని అన్నారు.
KGBV Admissions 2024: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
పిల్లలు వారి తల్లిదండ్రుల కంటే అధిక సమయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులతో గడుపుతారని, ఉపాధ్యాయులు తమ పదవి కాలంలో దాదాపు మూడు తరాల విద్యార్థులను వైద్యులు, ఇంజినీర్లతో పాటు అన్ని రంగాల్లో ఉన్నతంగా తయారు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Exam Papers Evaluation: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకణం.. తేదీ..?