Exam Papers Evaluation: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకణం.. తేదీ..?
Sakshi Education
పదో తరగతి విద్యార్థులు రాసిన పరీక్షలు ముగిసాయి. అయితే, ఇక ఆ జవాబు పత్రాల మూల్యాంకణం ప్రారంభమయ్యేందుకు తేదీని ప్రకటించారు అధికారులు..

తిరుపతి అర్బన్: పదోవ తరగతి మూల్యాంకణం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బీ.శేఖర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీకి మూల్యాంకణం పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నారు. మూల్యాంకణానికి సంబంధించి సీనియర్ ఉపాధ్యాయులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ISRO NRSC Recruitment 2024: ఇస్రో–ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి డ్యూటీలు కేటాయిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఈనెల 30వ తేదీకి పదో తరగతి పరీక్షలు పూర్తవుతాయని ఆయన వివరించారు.
Published date : 26 Mar 2024 04:07PM