Skip to main content

AU Engineering Entrance Test: ఏయూ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో వివిధ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏయూ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏయూఈఈటీ–2024) నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 Andhra University Engineering Entrance Test    Apply now for AUEET-2024  AU Engineering Entrance Test 2024 for admissions in engineering courses

అర్హత: బీటెక్‌లో ప్రవేశం కోసం కనీసం 45 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణులవ్వాలి(రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం ఉండాలి).

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, 
విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.04.2024.
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03.05.2024
ప్రవేశ పరీక్ష తేది: 05.05.2024.

వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/

చదవండి: AP ECET 2024 Notification: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

Published date : 26 Mar 2024 03:50PM

Photo Stories