Certificate Course Results: ఉపాధ్యాయుల సర్టిఫికెట్ కోర్సుల ఫలితాలు..
సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు (డ్రాయింగ్, హ్యాండ్లూమ్, నేవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) కోర్సులకు సంబంధించి ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడినట్టు పేర్కొన్నారు.
➤ Library Science Courses: ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
ఈ పరీక్షకు ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,691 మంది హాజరు కాగా, 1,733 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 64.40 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అభ్యర్థులు ఆన్‌లౌన్‌లో వెబ్‌సైట్ నుంచి మెమోరాండమ్ మార్క్స్ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఉత్తీర్ణులైనవారి సర్టిఫికెట్లు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ప్రభుత్వ పరీక్షల కార్యాలయం నుంచి వచ్చిన వెంటనే అభ్యర్థులకు అందజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.