Skill Training: నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ
మరికొంతమంది అభ్యర్థుల్లో సరైన స్కిల్స్ ఉండటం లేదు. దాంతో కార్పొరేట్ కొలువులకు ఎంపిక కావడం లేదు. ఈ నేపథ్యంలో వీరికి మెరుగైన నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం స్కిల్‌హబ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదట్లో రెండు కోర్సులతో స్కిల్‌హబ్ ప్రారంభమైంది. వృత్తి నైపుణ్య శిక్షణ పొందేందుకు నిరుద్యోగ యువత ఆసక్తి చూపుతుండడంతో మరో రెండు కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏప్రిల్ నుంచి కొత్త కోర్సుల బ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉన్న అవకాశాలకు అనుగుణంగా నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
చదవండి: నైపుణ్య శిక్షణకు త్రైపాక్షిక ఒప్పందం
శిక్షణతోపాటు ఉపాధి...
నిరుద్యోగుల కోసం ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాలో నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనకాపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో స్కిల్ హాబ్‌లను ఏర్పాటు చేసింది. నర్సీపట్నం స్కిల్‌హబ్ సెంటర్‌లో ప్రస్తుతం ప్రొటక్షన్ కెమిస్ట్రీ, జనరల్ డ్యూటీ నర్సింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల నుంచి కొత్తగా డోమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండన్డ్ అసిస్టెంట్, మ్యాన్ ఫ్యాక్చరింగ్, ప్యాకేజీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తొలి బ్యాచ్‌లో 30 మంది చొప్పున రెండు కోర్సుల్లో 60 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలపరిమితి మూడు నెలలగా నిర్ణయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలతోపాటు ఆయా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కొత్త కోర్సుల్లో చేరే నిరుద్యోగ యువత బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి ఉండాలి.
చదవండి: 150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
శిక్షణ తర్వాత ఉద్యోగాలు
కొత్త కోర్సులకు సంబంధించి బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్‌లో స్కిల్‌హబ్‌ను అందుబాటులోకి తెచ్చాం. 30 మందికి శిక్షణ ఇచ్చి 22 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాం. డోమిస్టిక్ ఐటీ హెల్ప్‌డెస్క్ అటెండన్డ్ అసిస్టెంట్‌కు బీఎస్సీ, బీఏ కంప్యూటర్స్ చదివి ఉండాలి. మ్యాన్ ఫ్యాక్చరింగ్, ప్యాకేజీ కోర్సులో యువకులకు మాత్రమే శిక్షణ ఇస్తాం. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు విధిగా బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి ఉండాలి. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వై.శ్రీనివాస్, స్కిల్ హబ్ ఇన్‌చార్జి, నర్సీపట్నం