Show cause notices: కంకిపాడు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
Sakshi Education
కంకిపాడు: పాఠశాల పనివేళల్లో తమ ముఖచిత్ర గుర్తింపు విధానంలో అటెండెన్సు నమోదు చేయని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 482 మంది ఉపాధ్యాయులకు బుధవారం జిల్లా విద్యాశాఖ నుంచి షోకాజ్ నోటీసులు జారీ కావటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో ముఖచిత్ర ఆధారిత అటెండెన్సుకు పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లానే ఎంపిక చేశారు. విజయవంతంగా ఈ ప్రక్రియను ఉపాధ్యాయులు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రభుత్వ ఆదేశాలతో ఒంటిపూట బడులు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం ఉదయం 7.45 గంటలకే ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరుకావాల్సింది. పాఠశాల పని వేళల్లో విధులకు వచ్చిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ముఖ ఆధారిత అటెండెన్సు (ఎఫ్‌ఆర్‌ఎస్) వేయాల్సి ఉంది.
Published date : 13 Apr 2023 07:17PM