TOEFL Exam: ఆంగ్లంలో నేపుణ్యం పెంచేందుకు టోఫెల్ పరీక్షలు.. నేడు జూనియర్ స్థాయిలో..!
వన్‌టౌన్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను బలోపేతం చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి సల్పుతున్నారు. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దే కార్యక్రమాలతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోంది. అందులో భాగంగా ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంచేందుకు వీలుగా టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసింది.
Jawaharlal Nehru University: ఈ జాబితాలో జేఎన్‌యూకు దేశంలోనే ప్రథమ స్థానం..!
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామర్థ్యాలు అలవడేలా తగిన శిక్షణను ఇచ్చి టోఫెల్ పరీక్షకు ఉపాధ్యాయులతో తర్ఫీదునిచ్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులు ఈ నెల 10వ తేదీ నుంచి టోఫెల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధులకు ప్రైమరీ స్థాయిలో, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ జూనియర్ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఉత్తీర్ణులకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నుంచి టోఫెల్ సర్టిఫికెట్లను ప్రదానం చేయనుంది.
TSWREIS: గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!.. ఇంటర్ బోర్డు నిబంధనల అతిక్రమణ
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 377 పాఠశాలల్లో మూడు నుంచి ఐదో తరగతి వరకూ చదువుతున్న 9,839 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నిర్వహించే ప్రైమరీ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన జరిగే టోఫెల్ జూనియర్ ప్రిపరేటరీ పరీక్షను ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న 50,851 మంది విద్యార్థులు రాసేలా ప్రణాళికలు రూపొందించారు. విద్యార్థుల్లో ఉన్నత నైపుణ్యాలు, బంగారు భవిష్యత్‌కు బాటలు వేయటమే లక్ష్యంగా టోఫెల్ పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
AP Intermediate Results: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్, పూర్తి వివరాలు ఇవే..