Midde Srinivasa Rao: ఆధునిక బోధనా దీప్తి 'మిద్దే'.. సాధించిన అవార్డులు ఇవే..
అంతటి కీలకమైన ఈ శాస్త్రాన్ని సాధారణ పద్ధతుల్లో బోధిస్తే విద్యా -ర్థుల బుర్రకెక్కదు. కష్టమనుకునే ఇంగ్లిష్, గణితం కంటే భౌతిక శాస్త్రం ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ విషయం విద్యార్థులకు బాగా తెలుసు.
అలాం టి భౌతిక శాస్త్రాన్ని అందరిలాగే బోధిస్తే ఆశించిన -ఫలితాలు రావన్న విషయాన్ని గ్రహించిన గుడి వాడ ఎస్పీఎస్ మునిసిపల్ ఉన్నత పాఠశాల భౌతి కశాస్త్ర అధ్యాపకుడు మిద్దే శ్రీనివాసరావు సరికొ త్తగా బోధనకు శ్రీకారం చుట్టారు.
ఆధునిక, సాంకే తికతను జోడించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో -పాఠాలు బోధిస్తున్నారు. సాంకేతిక పరికరాలతో ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ప్పటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఆయన బోధన విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో విద్యార్థులకు మేలు చేకూర్చుతోంది. అంతేకాదు జిల్లా, రాష్ట్రస్థాయితో పాటు జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిపింది. గుడివాడ కీర్తిని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ల్ని అధ్యాపకుడు మిద్దే శ్రీనివాసరావు సెప్టెంబర్ ఐదో తేదీన ఢిల్లీలో -రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకోనున్నారు.
చదవండి: RBI Quiz: ఆర్‌బీఐ క్విజ్.. రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం
రైతు కుటుంబం నుంచి..
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపా -డులో రైతు మిద్దే వెంకటేశ్వరరావు, కస్తూరి దం -పతులకు శ్రీనివాసరావు జన్మించారు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు.
ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గ్రామంలోని యూపీ పాఠశాలలో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు కంభంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడి యెట్ తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ నూజివీడు ప్రభుత్వ డీఆర్ కళాశాల, బీఈడీ ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచిలీపట్నం, ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సి టీలో పూర్తి చేశారు.
డీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం
చదువు పూర్తయిన తర్వాత 2000వ సంవత్సరంలో జరిగిన డీఎస్సీలో తొలి ప్రయత్నంలోనే మి శ్రీనివాసరావు అర్హత సాధించారు. గుడివాడ ఏడో వార్డులోని ఎంపీయూపీ స్కూల్లో ఉపాధ్యాయు డిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
నాలుగేళ్లు అదే పాఠశాలలో పని చేసి 2004లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి పొంది గుడివాడలోని ఏజీకే మునిసిపల్ హైస్కూల్లో భౌతిక శాస్త్ర ఉపా ధ్యాయుడిగా నియమితులయ్యారు. 2022లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులతో ఎస్పీఎస్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉద్యోగోన్నతి పొంది, అప్పటి నుంచి అక్కడే పని చేస్తున్నారు.
విద్యారంగానికి సేవలు
ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో పాఠ్యపుస్తకాల రూప కల్పన, సాంకే తిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను శ్రీనివాసరావు చేపట్టారు. ఏడో తరగతి రసాయన శాస్త్రం, 9,10 తరగతుల భౌతిక, రసాయన శాస్త్రాల పాఠ్యపుస్తకాలను రూపొందించారు.
సాధించిన అవార్డులు
శ్రీనివాసరావు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి వందకు పైగా అవార్డులు అందుకున్నారు. 2022లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా మచిలీపట్నంలో అవార్డు అందుకున్నారు.
2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై అప్పటి విద్యాశాఖ మం త్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ చేతుల మీదుగా విశాఖప ట్నంలో అవార్డు స్వీకరించారు. ఇప్పుడు 2024 సం వత్సరానికి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు. సెప్టెబర్ ఐదో తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందు కోనున్నారు.