Skip to main content

ITI Admission 2023: ఐటీఐలో రెండో విడత అడ్మిషన్లు

Second round admission in ITI

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో రెండో విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్‌ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఆప్షన్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐకి వచ్చే నెల 3, 4 తేదీల్లోను, ప్రైవేటు ఐటీఐలకు 5, 6, 7 తేదీల్లోను కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. సందేహాల నివృత్తికి 9494 688 516 నంబరులో సంప్రదించాలని సూచించారు.

JNTU Anantapur: ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 15 Jul 2023 04:12PM

Photo Stories