Skip to main content

JNTU Anantapur: ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

integrated courses in JNTU Anantapur

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం, బ్లెకింగ్‌ వర్సిటీ (స్వీడన్‌) సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అమలు చేస్తున్నాయి. ఇందులో అడ్మిషన్లు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ద్వారా బీటెక్‌ బ్రాంచ్‌లో తొలి మూడు సంవత్సరాలు , ఒక సంవత్సరం బీటీహెచ్‌ స్వీడన్‌లో బీఎస్‌ కోర్సు చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండు సంవత్సరాల ఎంఎస్‌ కోర్సును స్వీడన్‌లో అభ్యసించవచ్చు.

  • బీటెక్‌ కోర్సు మూడు సంవత్సరాలు జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌లోనూ, ఒక సంవత్సరం విద్యను బీటీహెచ్‌ స్వీడన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. డిగ్రీని జేన్‌టీయూ అనంతపురం ప్రదానం చేస్తుంది. బీఎస్‌ పట్టాను బ్లెకింగ్‌ వర్సిటీ (బీటీహెచ్‌) స్వీడన్‌ ప్రదానం చేస్తుంది.
  • ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (10 ఖాళీలు) ఇందులో విద్యార్థి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో 3 సంవత్సరాలు . స్వీడన్‌లో ఒక సంవత్సరం చదువుతారు.
  • ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో 10 ఖాళీలు.
  • ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మెషిన్‌ లెర్నింగ్‌లో 10 ఖాళీలు ఉండగా, జేఎన్‌టీయూ అనంతపురంలోని ఈసీఈ విభాగంలో మూడు సంవత్సరాలు, చివరి సంవత్సరం బ్లెకింగ్‌ వర్సిటీలో చదువుతారు.

Polytechnic Scholarships: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.50 వేలు!

విద్యార్హతలు
ఇంటర్మీడియట్‌ ఎంపీసీ కోర్సును పూర్తి చేసిన వారు అర్హులు. కనీసం 70 శాతం మార్కులు పొందాలి. జేఈఈ మెయిన్స్‌ –2023, ఏపీ ఈఏపీసెట్‌ –2023, టీఎస్‌ఈఏపీసెట్‌ – 2023 ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. బీటీహెచ్‌, స్వీడన్‌ మెరిట్‌ ఆధారిత ఉపకారవేతనాలు అందిస్తారు. పూర్తి వివరాలను జేఎన్‌టీయూ అనంతపురం ఫారిన్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌లో తెలుసుకోవచ్చు.

Published date : 15 Jul 2023 03:43PM

Photo Stories