Skip to main content

Schools Holidays: స్కూళ్లకు సెలవులు అప్పట్నుంచే.. కార‌ణం ఇదే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
Holidays
Schools Summer Holidays

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్తగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూళ్లు జ‌రుగుతున్నాయి. ఈ సమయాన్ని కూడా తగ్గించారు. ఇక‌పై పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే నిర్వ‌హిస్తారు. ఈ విధంగా మార్చి 31వ తేదీ నుంచి పనిచేయనున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్ర‌భుత్తం వెల్లడించింది. 

వార్షిక పరీక్షలు ఇలా..
దీంతో పాటు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 16 వరకు 1 నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

Published date : 31 Mar 2022 01:12PM

Photo Stories