Schools Closed : ఈ 15 జిల్లాల్లో విద్యాసంస్థల మూసివేత.. కారణం ఇదే..?
ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Holidays: 26 వరకు తరగతులు ప్రారంభం కావు
ఈ నేపథ్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలు మూసివేశారు. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, లక్నో, అలీఘర్, ఆగ్రా, ఇటా, మెయిన్‌పురి, ఫిరోజాబాద్ మరియు కాన్పూర్ సహా15కి పైగా జిల్లాల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూపీలో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.