Holidays: 26 వరకు తరగతులు ప్రారంభం కావు
దసరా సెలవులు అక్టోబర్ 9వ తేదీన ముగిసినా.. కాలేజీలకు అధ్యాపకులు హాజరవుతారు తప్ప తరగతులు ప్రారంభం కావని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పీజీ కోర్సుల తరగతుల నడుమ వ్యవధి ఏర్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాల అనంతరం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ఒకేసారి తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు రిజిస్ట్రార్ తెలిపారు. హాస్టళ్లు, భోజనశాలలు కూడా ఆక్టోబర్ 26 నుంచే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి ఏడాది మెస్ బకాయిలను చెల్లించి హాస్టల్, భోజన సౌకర్యాన్ని రెన్యువల్ చేయించుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు.
చదవండి:
TS PG Counselling 2022 : పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ .. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా..