Skip to main content

TS PG Counselling 2022 : పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ .. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు సెప్టెంబ‌ర్ 26వ తేదీన‌ విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్‌–2022 కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు.

ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి  ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు.

Osmania University Holidays : ఓయూకు దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా..
పీజీ ప్రవేశ పరీక్షలో  (సీపీజీఈసెట్‌–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్‌ తిరస్కరించనున్నట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు.

Published date : 24 Sep 2022 05:53PM

Photo Stories