Hostel Accommodation: కేయూలో విద్యార్థులకు హాస్టల్ వసతి
మొదటి సంవత్సరంలో ప్రవేశాలు, రిపోర్టింగ్ అక్టోబర్ 21న పూర్తికాగా హాస్టళ్లలో విద్యార్థులకు వసతి కల్పన అక్టోబర్ 22న నుంచి ఇస్తున్నారు.
ఓసీ విద్యార్థులకు రూ.12వేలు, బీసీలకు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.8వేలు, పీహెచ్‌సీ విద్యార్థులకు రూ.6వేల చొప్పున డిపాజిట్ ఫీజుగా చెల్లిస్తే మెస్‌కార్డులు జారీ చేస్తున్నారు. కేయూలో మొత్తం 14 హాస్టల్స్ ఉన్నాయి.
చదవండి: Free Coaching: ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు
ఫైనల్ ఇయర్ విద్యార్థులకు రెన్యూవల్..
ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా మెస్ కార్డులు రెన్యూవల్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు వచ్చే విద్యార్థులకు రూ .1,000 ఫీజు చెల్లిస్తే హాస్టల్ కేటాయిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి రాని విద్యార్థులు మాత్రం గతేడాదిలో మెస్ బకాయిల్లో సగం చెల్లిస్తేనే మెస్ కార్డులు రెన్యూవల్ చేస్తున్నారు. అలాగే, క్యాంపస్‌లోని వివిధ విభాగాల్లోని రెగ్యులర్, ఎస్‌ఎఫ్‌సీ కోర్సుల వారికి కూడా హాస్టల్ వసతి కల్పిస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కాగా, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటికే విద్యార్థులకు వసతి కల్పించారు. సుబేదారిలోని ‘లా’ హాస్టల్స్‌లో కూడా వసతి కల్పిస్తున్నారు. మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు మాత్రం హాస్టల్ వసతి లేదు.
28తేదీ వరకు రెన్యూవల్ చేసుకోవాల్సిందే..
ఫైనల్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ వసతి పొందేందుకు ఈనెల 28వతేదీ వరకు మాత్రమే మెస్ కార్డులు రెన్యూవల్‌కు గడువు ఉందని ఆ తరువాత వచ్చేవారికి మెస్ కార్డులు జారీ చేయబోమని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య సీహెచ్. రాజ్‌కుమార్ తెలిపారు.
వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొంది హాస్టల్ వసతి కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు యూనివర్సిటీ నియమ నిబంధనల ప్రకారం తరగతుల అటెండెన్స్‌ను కూడా మెయింటెనెన్స్ చేసుకోవాల్సింటుందని కూడా అందులో పేర్కొన్నారు.