నేటి నుంచి స్కూళ్లు.. విద్యా బోధనపై సందేహాలు..
రెండు వారాల తర్వాత స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సందడిగా మారనున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకూ ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఆ తర్వా త కొద్ది రోజులకు కాలేజీలకు సెలవులిచ్చారు. సెలవులు రావడంతో విద్యార్థులంతా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు.. అన్ని ఖాళీ అయ్యాయి. ఉపాధ్యాయులు కూడా తమ ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. విద్యా సంస్థల పునః ప్రారంభంతో వీళ్లంతా తిరిగి తమ గూటికి చేరుకుంటున్నారు.
చదవండి: బడి పిల్లల చదువులకు సానబెట్టండి
దసరా సెలవుల తర్వాత జరిగే బోధన స్కూల్ విద్యార్థులకు కీలకమైంది. ఎఫ్‌ఏ–2 పరీక్షలు జరిగినా, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన సిలబస్ మాత్రం పూర్తవ్వలేదు. 2022 ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టారు. దీంతో ద్విభాష పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. పుస్తకాల బరువు పెరగకుండా వాటిని రెండు భాగా లుగా చేశారు. ఈ కారణంగా ముద్రణ ఆలస్యమైంది. కొన్నిచోట్ల సెప్టెంబర్ మొదటి వారం వరకూ పార్ట్–1 పుస్తకాలు అందలేదు. దీనికి తోడు కరోనా కారణంగా నష్టపోయిన అభ్యసనను తిరిగి దారి లోకి తెచ్చేందుకు బ్రిడ్జ్ కోర్సులు, తొలిమెట్టు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ సిలబస్ ఆలస్యమవడానికి కారణమయ్యాయి.
చదవండి: పదో తరగతిలో మళ్లీ పదకొండు పేపర్లు
వాస్తవానికి పార్ట్–1 పుస్తకాల్లోని సిలబస్ దసరా సెలవుల కన్నా ముందే పూర్తవ్వాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తిరిగి పార్ట్–1లోని పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అంటున్నారు. ఇది పూర్తయి, పార్ట్–2 ఎప్పు డు మొదలు పెడతారనేదానిపై ఉపాధ్యాయ వర్గా లు స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, పదోన్నతులు, బదిలీల డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.
చదవండి: ఈ పథకం పొందాలంటే వధూవరులు కచ్చితంగా టెన్త్ పాస్ కావాలి..