సాక్షి ఎడ్యుకేషన్ : స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను రంపచోడవరం ఏజెన్సీ జిల్లా విద్యాశాఖాధికారి (ఏజెన్సీ డీఈవో) వై.మల్లేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇదీ ఆవశ్యకత
School Inspection in Andhra Pradesh
ఈ సందర్భంగా పాఠశాల తరగతులను, వసతి గృహం ఆవరణలను ఆయన పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల ప్రగతి, విద్యా సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెచ్‌ఎం, సబ్జెక్టు ఉపాధ్యాయులను సూచించారు.
జగనన్న విద్యాదీవెన కిట్లు అందాయా లేదా అనేది విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు. భోజన వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గంగవరం ఆశ్రమ బాలికల పాఠశాలలో జరుగుతన్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు అంశాలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీహేన్సన్, డిప్యూటీ వార్డెన్ లక్ష్మీకాంత, పీఈటీ పద్మావతి ఉన్నారు.