Skip to main content

After Class 12th: టీచింగ్ అంటే ఇష్ట‌మా... అయితే ఇంట‌ర్ త‌ర్వాత మీరు ఈ కోర్సులు చేయ‌డం బెస్ట్‌

ఇంట‌ర్ పూర్తయింది. హ్యాపీగా సెలవుల‌ను ఎంజాయ్ చేస్తున్నారా.? ఇక జూన్ వ‌చ్చేసింది. దీంతో ఇక సెల‌వుల‌కు బై బై చెప్పి మ‌ళ్లీ కాలేజీల‌కు హాజరుకావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే చాలా మంది ఇంట‌ర్ త‌ర్వాత త‌మ కెరియ‌ర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతుంటారు.
Best Teaching Courses
Best Teaching Courses

అంద‌రిలాగే బీటెక్‌, మెడిక‌ల్‌, డిగ్రీ కోర్సుల్లో జాయిన‌వుతుంటారు. అయితే మీకు టీచింగ్ అంటే అమితాస‌క్తి ఉంటే మీరు ఈ కోర్సులు చేయ‌డం ఉత్తమం. టాప్ టీచింగ్ కోర్సుల గురించి ఇక్క‌డ మ‌నం తెలుసుకుందాం.!


చ‌ద‌వండి: ఇంట‌ర్ త‌ర్వాత బెస్ట్ కోర్సులు ఇవే... మీరు ఏ కోర్సు ఎంచుకుంటున్నారు.?

NPTT (Nursery Primary Teacher's Training) 
ఇది కేవ‌లం ఏడాది డిప్లొమా కోర్సు. ఫీజు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌ను బ‌ట్టి ఏడాదికి రూ.5 వేల నుంచి రూ.25 వేల మ‌ధ్య ఉంటుంది. ఇంట‌ర్ 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించిన వారు అర్హులు. ఇది పూర్తి చేసిన వారికి ఏడాదికి వేత‌నం రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.3 లక్ష‌ల‌తో ప్రారంభ‌మ‌వుతుంది. నర్సరీ టీచర్, అసిస్టెంట్ ప్రీ ప్రైమరీ టీచర్, ఎన్టీటీ బీఎడ్ టీచర్, హోమ్ ట్యూటర్ ఇలాంటి ఉద్యోగాల్లో స్థిర‌ప‌డొచ్చు. 

nursing

టీటీసీ (Teacher Training Course)
ఇంట‌ర్ పూర్తి చేసిన త‌ర్వాత ఉపాధ్యాయ రంగంలోకి వెళ్లాల‌నుకునే వారికి ఇది బెస్ట్ కోర్సు. కేవ‌లం రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే మీరు టీటీసీ పూర్తి చేయొచ్చు. త‌ర్వాత ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో బోధించేందుకు అర్హ‌త సాధిస్తారు. అలాగే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లోనూ బోధ‌న చేయొచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed)
ఇంట‌ర్ త‌ర్వాత ఈ కోర్సులో చేరొచ్చు. స్పోర్ట్స్ రంగంలో స్థిర‌ప‌డాలి అనుకునే వారి కోసం బీపీ ఎడ్ ఓ చ‌క్క‌ని అవ‌కాశం. ఇందులో ప్ర‌వేశాల కోసం BHU UET, ITM NEST, LPUNEST రాయాల్సి ఉంటుంది. ఇది నాలుగేళ్ల కోర్సు. ఫీజు రూ.10 వేల నుంచి రూ.60 వేల వ‌ర‌కు ఉంటుంది. ఇది పూర్తి చేసిన త‌ర్వాత ఏడాదికి రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ల‌భిస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్పోర్ట్స్ ట్రైనర్, పర్సనల్ ట్రైనర్, జిమ్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, యోగా ట్రైనర్, కోచ్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఫిట్నెస్ ఇన్చార్జి ... ఇలాంటి ఉద్యోగాల్లో స్థిర‌ప‌డొచ్చు. 

students

చ‌దవండి: NFAT-2023: వినూత్న కెరీర్‌.. ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌!

డీఈడీ (Diploma in Education)
ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాలి. దీనిలో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష డీఈఈసెట్‌. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సివుంటుంది.  

డీఈఈ సెట్‌ రాయాలంటే...ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఇంటర్‌ పరీక్ష రాస్తున్నవాళ్లూ అర్హులే. అయితే కోర్సులో చేరే సమయానికి పరీక్ష పాసై ఉండాలి. ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. ఒకేషనల్‌ కోర్సులతో ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హతలేదు. 

B.ed

చ‌దవండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

బీఈడీ (Bachelor of Education) 
ఇంట‌ర్ పూర్తి చేసిన త‌ర్వాత‌... జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు చేయొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సులకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) అనుమతి ఇస్తుంది.

students


బీఏ బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు (Bachelor of Arts and Bachelor of Education degrees)
నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీఈడీతో కూడిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అమలు చేయాలని నిర్ణయించింది. బీఎస్సీ, బీఏ, బీకాం, డిగ్రీ కోర్సులతో పాటు సమాంతరంగా నాలుగేళ్ల వ్యవధిలోనే బీఈడీ పూర్తి చేసుకునే వెసులుబాటు కలగనుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)ఆధ్వర్యంలో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎస్‌సీఈటీ)లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

సాధారణంగా మూడేళ్ల డిగ్రీ తర్వాత బీఈడీ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. అదనంగా మరో రెండేళ్లు కోర్సు పూర్తిచేయాలి. మొత్తం అయిదేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో చేరితే నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తిచేసే వెసులుబాటు ఉంటుంది. ఇది పూర్తిచేసినవారు నాలుగంచెల్లో నిర్వహించే ఫౌండేషన్‌, ప్రీప్రైమరీ, మిడిల్‌, సెకండరీ విధానంలో బోధనకు అర్హులు.

B.ed


ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా (Diploma in Elementary Education)
మీరు ఈ డిప్లొమాని ఇంటర్మీడియట్‌ తర్వాత చేయొచ్చు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్నఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ/ బీకామ్‌ బీఈడీ కోర్సు కూడా చేయొచ్చు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమాతో పాటు ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసినట్లయితే, బీఈడీ చేయకుండా నేరుగా ఎంఈడీ చేయడానికి అర్హులవుతారు. 

చ‌ద‌వండి: మెరుగైన‌ భవిష్యత్‌కు...విలువైన మల్టీడిసిప్లినరీ కోర్సు..

డీఈడీ/ బీఈడీ తరువాత టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో బోధన రంగంలోకి ప్రవేశించవచ్చు. మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ, పీజీలతో పాటు ఎంఈడీ+ పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే  బీఈడీ/ ఎంఈడీ కోర్సులను బోధించడానికి అర్హులవుతారు.

Published date : 01 Jun 2023 07:14PM

Photo Stories