Skip to main content

D.EL.ED Counselling : ఈనెల 30న‌ డీఈఎల్‌ ఈడీ కోర్సులో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌..

Principal of DIET AM Jayashree announcing DELED counseling dates  Counselling for Diploma in Elementary Education course admissions

రాజమహేంద్రవరం: ప్రభుత్వ, ప్రైవేటు డీఈఎల్‌ ఈడీ కోర్సులో ప్రవేశాలకు డీఈఈ సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఈనెల 30న ప్రారంభం కానుంది. జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) ప్రిన్సిపాల్‌ ఏఎం జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కళాశాలల వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. జూలై 5 నుంచి 7వ తేదీ వరకూ సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 9న ప్రొవిజనల్‌ లెటర్‌ జారీ చేస్తారని, ఆ రోజు నుంచి 13వ తేదీ వరకూ సంబంధిత డైట్‌ సంస్థల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని వివరించారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని జయశ్రీ తెలిపారు.

Intermediate Classes: ‘ఇంటర్‌’ క్లాసులు చెప్పేదెవరు? వేధిస్తున్న ఫ్యాకల్టీ కొరత

Published date : 28 Jun 2024 03:22PM

Photo Stories