Skip to main content

After Class 12th: ఇంట‌ర్ త‌ర్వాత బెస్ట్ కోర్సులు ఇవే... మీరు ఏ కోర్సు ఎంచుకుంటున్నారు.?

ఇంట‌ర్ పూర్తయ్యింది. ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. కొంత మంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు అడుగులు వేయ‌గా, మ‌రికొంత మంది మెడిసిన్ వైపు మ‌ళ్లారు. ఈ ఇద్ద‌రిలా కాకుండా భిన్నంగా ఆలోచించే విద్యార్థులు ఈ కోర్సుల‌వైపు ఓ లుక్కేయండి.
After Class 12th
After Class 12th

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌(BSM)
విరాట్ కోహ్లి ఎంత పేరున్న ఆటగాడో మనందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్త అథ్లెట్లను అధిగమించి అతడు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. మరి కోహ్లి తానొక్కడే తన వ్యాపార విలువ, ప్రచార కార్యక్రమాల సమయపాలన లాంటివన్నీ చూసుకోలేడు కదా.. ఆ పర్యవేక్షణ బాధ్యత, సంబంధిత వ్యాపార లావాదేవీలను చూసుకోవడానికి నిష్ణాతుడైన క్రీడా నిర్వాహకులు అవసరమవుతారు. బ్రాండ్ ఇమేజ్, మార్కెటింగ్ తదితర అంశాలను నిరంతరం ఎవరో ఒకరు పర్యవేక్షిస్తుంటేనే ఇది సాధ్యం. ఇలాంటి బహుముఖ బాధ్యతలను పర్యవేక్షించేవారే "స్పోర్ట్స్ మేనేజర్".

చ‌దవండి: NFAT-2023: వినూత్న కెరీర్‌.. ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌!

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌(BBA)
ఇంట‌ర్ త‌ర్వాత డిగ్రీలో చేరాల‌నుకునే విద్యార్థుల‌కు ఇదొక బెస్ట్ ఆప్ష‌న్‌. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థుల‌కు ఈ కోర్సు ఓ చ‌క్క‌ని అవ‌కాశం. డిగ్రీలో బీబీఏ పూర్తి చేసిన త‌ర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు.  

inter

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌(B.C.A)
సాఫ్ట్‌వేర్ రంగంలో దూసుకెళ్లేందుకు ఈ కోర్సు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. డిగ్రీ స్థాయిలోనే కంప్యూట‌ర్ కోర్సుల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న ల‌భిస్తుంది. బీసీఏ పూర్తి చేసిన త‌ర్వాత పీజీలో ఎంసీఏ చేయొచ్చు.

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ (BHA)
హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన వారికి సాధారణంగా హాస్పిటల్స్‌, హెల్త్‌ ఆర్గనైజేషన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, రిహాబిలిటేషన్‌ సెంటర్స్‌, హాస్పిటల్‌ సపై ్ల ఫర్మ్స్‌, మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, హాస్పిటల్‌ కన్సల్టెన్సీ ఫర్మ్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ ఉద్యోగావకాశాలుంటాయి. కెరీర్‌ ప్రారంభంలో అసిస్టెంట్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ లేదా మేనేజర్‌గా ఫ్రంట్‌ ఆఫీస్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఫైనాన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ వంటి విభాగాల్లో విధులు నిర్వహించాలి. తర్వాత ప్రతిభ ఆధారంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) వరకు కూడా చేరుకోవచ్చు.

చ‌దవండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

inter

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (BHM)
ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న అన్ని గ్రూపుల విద్యార్థులూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల్లో చేరవచ్చు. కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో వీటిని అందిస్తున్నాయి. అలాగే కార్పొరేట్‌ సంస్థలు ఇంటర్‌ విద్యార్హతతోనే యూజీ కోర్సు, శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటున్నాయి. ఆతిథ్య రంగంలో సేవలు అందించాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ అనంతరం ఆ దిశగా అడుగులేయవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు. వీటి వ్యవధి మూడేళ్లు.

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ బిజినెస్ ఎక‌న‌మిక్స్ (BBE)
ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉజ్వ‌ల భ‌విష్యత్తు ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో బిజినెస్ ఎక‌న‌మిక్స్ పూర్తి చేసిన వారికి మంచి అవ‌కాశాలు ఉన్నాయి. ఇంట‌ర్ పూర్తయిన విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవ‌చ్చు. 

inter

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (BBM)
ఎప్పటికీ తరగని ఆదరణ ఉన్న కోర్సు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి వేతనమూ అందుతుంది. డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరితే భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవచ్చు.

చ‌ద‌వండి: మెరుగైన‌ భవిష్యత్‌కు...విలువైన మల్టీడిసిప్లినరీ కోర్సు..

బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్ (BMS)
మెరికల్లాంటి విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ విద్య చ‌క్క‌ని ఆప్ష‌న్‌. కెరియ‌ర్ ప‌రంగా ఉన్న‌తస్థాయికి చేరుకోవ‌చ్చు.  

అలాగే అకౌంట్స్‌లో మంచి ప‌ట్టు సాధించేందుకు బీకాంలో చాలా కోర్సులే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ కోర్సు చేసిన అకౌంట్స్ ప‌రంగా మంచి నాలెడ్జ్ వ‌స్తుంది. కామ‌ర్స్ విభాగంలో మేనేజ్‌మెంట్ కోర్సు B.Com (Management), Computer Aided Management (B.CAM) కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి.

Published date : 30 May 2023 07:30PM

Photo Stories