‘బీబీఏతో 3 రోజుల చదువు, 3 రోజుల సంపాదన’
Sakshi Education
కామారెడ్డి అర్బన్: బీబీఏ రిటైల్ వృత్తి విద్య కోర్సు చదివే విద్యార్థులకు వారంలో మూడు రోజులు చదువు, మూడు రోజుల సంపాదన ఉంటుందని, కామారెడ్డి ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల విద్య రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీబీఏ కోర్సు చదివే విద్యార్థులకు అక్టోబర్ 27న అవగాహన కార్యక్రమం నిర్వహించగా రాజేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు.
వ్యాపార రంగం బహుముఖాలుగా విస్తరిస్తున్నందున విద్యార్థులు త్వరగా ఉపాధి కల్పించే కోర్సులు చేయడం ఉత్తమమన్నారు. వినియోగదారులకు సేవలు అందించే రిటైలింగ్, లాజిస్టిక్స్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో వెంటనే ఉపాధి లభిస్తుందని, ఉద్యోగంతో పాటు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, అకడమిక్ సమన్వయకర్త వి.శంకర్, బీబీఏ సమన్వయకర్త జె.శివకుమార్, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
ABVP: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
KNRUHS: బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
Published date : 28 Oct 2023 01:39PM