Skip to main content

ABVP: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలి

కరీంనగర్‌ సిటీ: శాతవాహన యూనివర్శిటీ పరిదిలో నవంబర్‌ 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బామండ్ల నందు అన్నారు.
ABVP,ABVP City Secretary Nandu calls for postponement of Satavahana University 5th semester exams starting November 1 in Karimnagar City
డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలి

అక్టోబ‌ర్ 26న‌ ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బామండ్ల నందు మాట్లాడుతూ ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన సెలబస్‌ పూర్తి కానందున విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతనెల పండుగల నేపథ్యంలో అనేక సెలవులు రావడం వల్ల విద్యార్థులు తమకు సంబంధించిన సెలబస్‌ పూర్తికాలేదన్నారు.

చదవండి: KNRUHS: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సెలబస్‌ పూర్తయ్యేంతవరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై యూనివర్సిటీ వీసీ సానుకూలంగా స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూసాల సాయి విష్ణు, ఎస్‌ఎఫ్‌డీ ఇన్‌చార్జి శ్రివర్ధన్‌, వెంకటేష్‌, నాగరాజు, శ్రీకాంత్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.   

Published date : 27 Oct 2023 01:12PM

Photo Stories