Skip to main content

KNRUHS: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Hyderabad's Premier Health Sciences University, Admission Announcement at Kalologi Arogya University, Kalologi Arogya University Admission, B.Sc Allied Health Sciences Admissions, Apply Now for B.Sc Allied Health Sciences, Applications for admission to BSc Allied Health Sciences degree courses
బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ గురు వారం ఒక ప్రకటన విడుదల చేసింది.     బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్, కార్డియో వాస్క్యులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్‌  టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియోలజీ, స్పీచ్‌ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్‌ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ  తదితర కోర్సులకు ప్రవేశం కల్పించనున్నట్లు వివరించింది.

చదవండి: PG Admissions: అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారని పేర్కొంది. మరిన్ని వివరాలకు  www.knruhs.telangana.gov.in లో చూడాలని సూచించింది.   

Published date : 27 Oct 2023 12:13PM

Photo Stories