Skip to main content

Schools : రేపే స్కూల్స్ ప్రారంభం.. వీరికి మాత్రం ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని పాఠశాల‌కు, కాలేజీల‌కు సంక్రాంతి సెలవులు ముగిసాయి. తెలంగాణ‌లోని స్కూల్స్‌కు జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

తెలంగాణ జనవరి 18వ తేదీన (బుధవారం) పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఇచ్చారు. తెలంగాణ జూనియ‌ర్ కాలేజీలకు కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 16న కనుమ పండుగ ఉండగా.. అదేరోజు కాలేజీలు తెరచుకున్నాయి.

➤ వ‌చ్చే ఏడాది 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

☛ January Holiday 2023 : జనవరిలో సెలవులు ఇవే.. నిరాశ ప‌రిచిన రోజు ఇదే..

ఏపీలో మాత్రం..

ap school holidays news telugu

ఈ ఏడాది ప్రకటించిన అకడమిక్ సెల‌వుల క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవుల్ని జనవరి 11 నుంచి 16 వరకూ ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. అయితే సంక్రాంతి సెలవుల్లో మార్పుకు సంబంధించి ఇటీవ‌ల ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. జ‌న‌వ‌రి 17వ తేదీ ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని 12 నుంచి 18వ తేదీకి మార్పు చేశారు. 19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.

☛ 2023లో ప్రభుత్వ సెలవులు ఇవే..

Published date : 17 Jan 2023 07:37PM

Photo Stories