January Holiday 2023 : జనవరిలో సెలవులు ఇవే.. నిరాశ పరిచిన రోజు ఇదే..
ఇక ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ సారి ఎక్కువగా ఆదివారాలు సెలవులకు ఆటకం కల్గించి.. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు తీసుకునే అవకాశం లేకుండా చేశాయి. ఈ సారి విద్యార్థులు, ఉద్యోగులకు జనవరి నెలలో వచ్చే సెలవులు వివరాలు కింది విధంగా ఉన్నాయి..
☛ వచ్చే ఏడాది 2023లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే.. ఈ సారి ఉద్యోగులకు మాత్రం..
జనవరి నెలలో వచ్చే సెలవులు ఇవే..
☛ సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.
☛ ఈ నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.
☛ భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది.
☛ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.
☛ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.
☛ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలకు.. సంక్రాంతి సెలవులు ఇవే..
తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. అలాగే తెలంగాణలో కంటే ఆంధ్రలోనే ఈ పండగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో.., గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ముందుగానే ఫిక్స్ చేసాయి. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అలాగే జనవరి 17వ తేదీన తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో సంక్రాంతి సెలవుల గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.
నిరాశ పరిచిన రోజు ఇదే..
ఈ కొత్త సంవత్సరంలో సాధారణంగా జనవరిలో ఎక్కువ సెలవులు ఉంటాయి. ఎందుకంటే.. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే సైతం ఈ నెలలోనే ఉంటాయి. ఇక ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జనవరి 1న సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఈసారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం లేదు. భోగి పండుగ కూడా రెండో శనివారం రాగా.. సంక్రాంతి ఆదివారం వచ్చింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు మూడు రోజులు సెలవులను కోల్పోయారు.
తెలంగాణలో సంక్రాంతి ఎన్ని రోజులంటే..
తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. తిరిగి జనవరి 18న స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో పండుగలు రావడంతో.. రెండ్రోజుల సెలవులు తగ్గుతున్నాయని విద్యార్థులు ఫీలవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం..
సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇంకా భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు. ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది.
Work From Home : కరోనా ఎఫెక్ట్.. ఆఫీస్‌కు రావొద్దు.. వచ్చే ఏడాది మొత్తం ఇలాగే..!