Skip to main content

Nutrition Gardens : పాఠ‌శాల‌ల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు.. ఎందుకంటే!

పీఎం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆవరణలో న్యూట్రీషన్‌ గార్డెన్ల..
Nutrition gardens in schools under PM Poshan Abhiyan program

అనంతపురం: పీఎం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆవరణలో న్యూట్రీషన్‌ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూట్రీషన్‌ గార్డెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించడంతో పాటు పర్యావరణంపై పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చన్నారు.

Dell Work From Office: వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఫుల్‌స్టాప్‌ పెట్టిన ప్రముఖ ఐటీ కంపెనీ..

పర్యావరణ సమస్యలు, సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించవచ్చన్నారు. ఉపాధి పథకం ద్వారా పాఠశాల ఆవరణ చుట్టూ మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్రతి స్కూలులో కిచెన్‌ గార్డెన్‌కు సంబంధించి ఉపాధ్యాయుడిని నోడల్‌ అధికారిగా నియమించాలని, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు పర్యవేక్షించేలా చూడాలన్నారు. కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకు అవసరమైన పరికరాల కోసం సర్వ శిక్ష అభియాన్‌ నిధులు అందిస్తామన్నారు. దీంతో పాటు ఆయా పాఠశాలల్లో ఒక ఎకో–క్లబ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Posts at KGBV : కేజీబీవీల్లో 68 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అక్టోబ‌ర్ 10వ తేదీలోగా..

పాఠశాల స్థాయి ఎకో–క్లబ్‌లో టీమ్‌ లీడర్‌గా ప్రధానో పాధ్యాయుడు, సహాయకులుగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక తరగతి ఉపాధ్యాయుడు, కో–ఆర్డినేటర్‌గా ఒక విద్యార్థి, సభ్యులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉండాలన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

జిల్లాస్థాయి ఎకో–క్లబ్‌కు కలెక్టర్‌ లేదా జెడ్పీ సీఈఓ చైర్‌పర్సన్‌గా, కన్వీనర్‌గా జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రతినిధులుగా కృషి విజ్ఞాన కేంద్రం ఇన్‌చార్జి, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ/ ఉద్యాన శాఖ, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్కరు ఉంటారని చెప్పారు.

Coaching for Teachers : ఉపాధ్యాయుల‌కు ఈ విభాగాల్లో మూడు రోజుపాటు శిక్ష‌ణ‌.. పూర్తి వివ‌రాలు..

సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న, డీఈఓ వరలక్ష్మి, ఏడీ నాగరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Published date : 27 Sep 2024 01:33PM

Photo Stories