Skip to main content

Thalli Vandanam : త‌ల్లి వంద‌నం పథ‌కం పొందేందుకు ఈ ప‌త్రాలు త‌ప్ప‌నిసరి.. కాని, జీవో ప్ర‌కారం మాత్రం!

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘తల్లికి వందనం, స్టూడెంట్‌ కిట్‌’ పొందేందుకు ఆధార్‌ను ప్రామాణికం చేసింది..
New education scheme by new government for poor students  Government scheme announcement Aadhaar for student benefits Government initiative for students  Government scheme for student kits

సాక్షి, అమరావతి: ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం జీవో నం.29 జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి అయిన క్రమంలో ఈ పథకాలకు కూడా నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, 75 శాతం హాజరు ఉన్న ఒకటి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.

Apprentice Training : ఎన్‌ఏపీఎస్‌ సహా పలు అప్రెంటీస్‌షిప్‌ స్కీమ్స్‌.. ఈ ట్రైనింగ్‌తో క్షేత్ర నైపుణ్యాలు!

గుర్తింపునకు ఆధార్‌తో పాటు అనుబంధంగా ఫొటో ఉన్న బ్యాంక్, పోస్ట్‌ ఆఫీస్‌ పాస్‌బుక్, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్డు, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్స్, తహసీల్దార్‌ లేదా గెజిటెడ్‌ అధికారి జారీ చేసిన ఫొటో సర్టిఫికెట్‌లలో ఏదో ఒకటి జత చేయాలని పేర్కొన్నారు. కాగా, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, బుధవారం జారీ చేసిన జీవో నం.29లో ఈ పథకం కింద ఒక్కో తల్లికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

607 Jobs: కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. 435 పోస్టులకు 2,400 దరఖాస్తులు..

ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌లలో భాగంగా ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇది ఒకటి నుంచి ఇంటర్‌ వరకు (ప్లస్‌ 2) పిల్లలను పాఠశాలలు/కళాశాలలకు పంపేవారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి వెళుతున్నారన్నది కాకుండా ఒక్క తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇవ్వన్నునట్టు తాజాగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Trade Apprentice Posts : ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 11 Jul 2024 01:18PM

Photo Stories