Skip to main content

NAAC at Degree College : ప్ర‌భుత్వ మ‌హిళ డిగ్రీ క‌ళాశాల‌లో న్యాక్ బృందం.. వ‌స‌తులు, విద్యాభివృద్దిపై ప‌రిశీల‌న‌!

క‌ళాశాల‌ను ప‌రిశీలించి, అక్క‌డి వ‌స‌తులు, విద్యార్థుల చ‌దువును గురించి వారిని అడిగి తెలుసుకునేందుకు మ‌హిళ డిగ్రీ క‌ళాశాల‌కు వచ్చారు న్యాక్ బృందం..
NAAC visits Government Degree Women's College for inspection  PowerPoint presentation on college progress  IQAC coordinator presenting educational improvements

హిందూపురం: స్థానిక ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను న్యాక్‌ పీర్‌ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. బృందం సభ్యులు డాక్టర్‌ ఆర్ముగం, మానస్‌ పాండే, పద్మ... కళాశాలలోని అన్ని విభాగాలలో అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, కో–కరికులర్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యకలాపాలను పరిశీలించారు. అలాగే విద్యార్ధినులు, పూర్వ విద్యార్ధినులు, తల్లిదండ్రులు, కళాశాల అభివృద్ది కమిటీ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. అభివృద్ది పనులపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్‌, ఐక్యూఏసీ సమన్వయకర్తలతో పాటు వివిధ విభాగాల అధిపతులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గత ఐదేళ్లలో కళాశాల అభివృద్ధిని కమిటీ సభ్యులకు వివరించారు.

Scouts and Guides : ప్ర‌తీ పాఠ‌శాల‌ల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు!

కళాశాలలోని ప్రయోగశాలలు, గ్రంథాలయం, జిమ్‌, కార్యాలయం, హాస్టల్‌ ఇతర వసతులు, సౌకర్యాలను పరిశీలించడంతో పాటు సాయంత్రం విద్యార్దినుల సాంస్కృతిక కార్యక్రమాలు, యుద్ధ విన్యాసాలు, యోగా సాధనను తిలకించారు. శుక్రవారం కూడా పరిశీలన కొనసాగనుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రగతి, కళాశాల కమిషనరేట్‌ తరఫున అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దివాకర్‌రెడ్డి, కళాశాల అబివృద్ధి కమిటీ సభ్యులు తరఫున ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈటీ రామ్మూర్తి, సుదర్శన్‌, అనూష, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ శ్రీలక్ష్మి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేసు, భోజప్ప, డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Holidays: తల్లిదండ్రులతో గడిపేందుకు రెండు రోజులు సెలవు

Published date : 12 Jul 2024 12:24PM

Photo Stories