Scouts and Guides : ప్రతీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు!
పుట్టపర్తి అర్బన్: విద్యాశాఖ సహకారంతో ప్రతి పాఠశాలలోనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రస్థాయి గైడ్స్ జోనల్ అధికారి ఉమాదేవి తెలిపారు. గురువారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే శిక్షణా కార్యక్రమాలపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించి, సమాజాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలపై పూర్తి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
TS DSC 2024 Hall Ticket Download : డీఎస్సీ హాల్‌టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
అలాగే జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ కోసం భవన నిర్మాణానికి తోడ్పాటునందించాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది రామకృష్ణ, నాగరాజు, లాజర్, సెక్రెటరీ భాస్కరరెడ్డి, జిల్లా కార్యదర్శి గిరిధర్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజగుప్తా, ఫణిభూషణరావు, వెంకటరమణప్ప తదితరులు పాల్గొన్నారు.
Gujarat Job Interview Video Viral: నిరుద్యోగానికి నిదర్శనం!..5 పోస్టులు.. 1000 మంది పోటీ
Tags
- scouts and guides
- Schools
- Students
- students education
- Education Department
- Zonal Officer of State Level Guides
- awareness program for students
- School Students
- Education News
- Sakshi Education News
- Puttaparthi Urban news
- Scouts and Guides initiative
- Education Department collaboration updates
- School training programs
- Society development through education
- DEO office meeting