MBA Exams: డిసెంబర్ 6 నుంచి ఎంబీఏ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య ఎంబీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఎక్స్ విద్యార్థులకు డిసెంబర్ 6 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు. డిసెంబర్ 6, 12, 16, 21, 28, జనవరి 3, జనవరి 8న పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
చదవండి: Degree Exams: డిసెంబర్ చివరి వారంలో డిగ్రీ పరీక్షలు
డిగ్రీ పరీక్ష ఫీజులు చెల్లించాలి
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా పరీక్షల ఫీజులు డిసెంబర్ 4 వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లారెడ్డి తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉందన్నారు. కాగా.. పరీక్షల ఫీజులను కళాశాలల యాజమాన్యాలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు.