Pushpak Reusable Pilot Vehicle : పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్.. ప్రకటించిన ఇస్రో!
Sakshi Education
గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ పరీక్ష రీ యూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సాధించిందని మరోసారి నిరూపించింది. పుష్పక్‌గా పిలిచే ఈ ఆర్‌ఎల్‌వీ ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా ఖచ్చితంగా రావడం.. ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం.. వేగంగా ల్యాండ్ అవడం వంటి లక్ష్యాలను ఖచ్చితత్వంతో సాధించింది. ల్యాండింగ్ ఎక్స్‌పరిమెంట్ (ఎల్‌ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని జూన్ 23వ తేదీ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఇస్రో ఏరోనాటికల్ టెస్ట్‌రేంజ్‌లో జరిపారు.
New Indian Criminal Laws: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇవే..
Published date : 03 Jul 2024 03:43PM