Frank Duckworth : ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూత..
Sakshi Education

వర్షం వస్తే క్రికెట్ మ్యాచ్‌ల ఫలితాలను నిర్దేశించే ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూశారు. 84 ఏళ్ల డక్‌వర్త్ జూన్ 21న మరణించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ గణాంకవేత్త.. టోనీ లూయిస్‌తో కలిసి రూపొందించిన విధానాన్ని క్రికెట్‌లో 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) అమలు చేస్తోంది. ఆస్ట్రేలియా స్టాటిస్టిషియన్ స్టీవెన్ స్టెర్న్ సూచించిన పలు మార్పుల తర్వాత ఐసీసీ ఈ విధానాన్ని ‘డక్‌వర్త్ లూయి స్టెర్న్–డీఎల్‌ఎస్'గా మార్చింది. టోనీ లూయిస్ 2020లోనే మరణించారు. 2010లో డక్‌వర్త్, లూయిస్‌కు ప్రతిష్టాత్మక మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (ఎంబీఈ) అవార్డు లభించింది.
Famous Writer Arundhati Roy : పెన్ పింటర్ పురస్కార గ్రహీత అరుంధతీ రాయ్
Published date : 03 Jul 2024 03:44PM