Free Education: పోలీసుల పిల్లలకు ఉచిత విద్య
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు, సిబ్బందితో నగరంలో శాంతిభద్రతలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.
సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందులో ఉంటుందని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని చెప్పారు.
చదవండి: Ispirational Success Story : ఒకే వ్యక్తి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడిలా.. కానీ..
సామర్థ్యం, పనితీరుతోనే బదిలీలు కోరుకోవాలని సీఎం సూచించారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు రిటైర్డ్ ఐపీఎస్ సందీప్ శాండిల్య ఉదాహరణ అని పేర్కొన్నారు. రిటైరైనప్పటికీ సందీప్ శాండిల్యకు మాత్రమే ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన విషయం గుర్తించాలన్నారు.
Published date : 03 Jul 2024 12:10PM