10th Exam Papers Evaluation: రేపు పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..
కోలారు: నగరంలోని 6 కేంద్రాల్లో 1500 మంది ఉపాధ్యాయులతో పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌ను ఈనెల 15వ తేదీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీడీపీఐ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన శనివారం నగరంలోని మహిళా సమాజ కళాశాలలో పదో తరగతి జవాబుపత్రాల వాల్యుయేషన్‌పై సిబ్బందికి అనుసరించాల్సిన నియమ నిబంధనల గురించి వివరించారు.
KGBV Rankers: ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన కేజీబీవీ విద్యార్థినులు..
నియమించిన ఉపాధ్యాయులంతా పేపర్ వాల్యుయేషన్ సమయంలో సమయ పాలన తప్పకుండా పాటించాలన్నారు. రోజుకు ఇచ్చిన సమాధాన పత్రాలను తప్పకుండా వాల్యుయేషన్ చేయాలన్నారు. ఎలాంటి లోపదోషాలకు తావు లేకుండా విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఉప మౌల్యమాపకులు ఒక రోజు ముందుగానే డీ కోడింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈసారి కూడా మీరే మార్కులను కంప్యూటర్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. వాల్యుయేషన్ సమయంలో తప్పులు చేస్తే అందుకు తగిన జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
APPSC Group-1 Prelims Results: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అభ్యర్థులు అర్హులు..!
పూర్తి బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వాల్యుయేషన్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ప్రతి నిత్యం ఉదయం 9 గంటలకు కేంద్రాలకు హాజరు కావాలన్నారు. సమావేశంలో విషయ పరీక్షకులు శంకరేగౌడ, సగీరా అంజుం, విషయ పరీక్షకులు శశివదన, ఏవైపీసీ మోహన్‌బాబు పాల్గొన్నారు.
Tags
- Tenth Exams
- board exam papers
- karnataka tenth exam papers evaluation
- School Students
- Tenth Exams 2024
- appointing teachers for evaluation
- Evaluation centers
- strict rules at centers
- DDPI Krishna Murthy
- Tenth results date
- tenth exam papers evaluation date
- Education News
- Sakshi Education News
- karnataka news
- DDPI Kristhamurthy
- Class 10 Exams
- Teacher appointments
- Paper evaluation
- Instruction issuance
- Document assessment
- sakshieducation updates