Skip to main content

JNVST 2024: ఈ చాన్స్ మిస్ చేసుకోకండి... మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?

2024-25 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో (Jawahar Navodaya Vidyalaya selection test) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును జవహర్‌ విద్యాలయ సమితి పొడిగించింది. ముందుగా వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు ఆగస్టు 10తో గడువు ముగిసింది.
JNVST 2024
ఈ చాన్స్ మిస్ చేసుకోకండి... మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?

అయితే కొన్ని అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌ తుది గడువును మ‌ళ్లీ ఆగస్టు 25కు పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే అధికారులు రెండు సార్లు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు. మొద‌ట‌ ఆగస్టు 10వ తేదీతో గడువు ముగియగా.. వారం రోజుల పాటు లాస్ట్ డేట్‌ను అధికారులు పొడిగించారు. ఈ గడువు నేటితో ముగియనుండటంతో తాజాగా ఆగస్టు 25వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

ఇవీ చ‌ద‌వండి: నాణ్యమైన విద్యకు.. నవోదయ విద్యాలయాలు

Navodaya

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నవంబర్‌ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2024 జనవరి 20 (శనివారం) తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.

ఇవీ చ‌ద‌వండి: ఈ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు

Published date : 18 Aug 2023 11:09AM

Photo Stories