National Teachers Day 2023: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారాలు
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్య విభాగంలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ఎంపికయ్యారు. ఇందులో పులివెందుల వైఎస్ వీఆర్‌ఎం ప్రభుత్వ కళాశాలలో సంస్కృతి లెక్చరర్‌గా పనిచేస్తున్న వై. నాగేంద్రమ్మ, నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి నీలవేణిలను ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరు నేడు విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నారు.
డాక్టర్ వై. నాగేంద్రమ్మ
పులివెందులలోని వైఎస్ వీఆర్‌ఏం ప్రభుత్వ బాలికల కళాశాలలో సంస్కతం అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ వై. నాగేంద్రమ్మ ప్రాథమిక విద్యను నల్గొండలో పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు చిత్తూరు జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో, ఇంటర్, డిగ్రీలను బాపట్ల జిలెల్లపూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో పూర్తి చేశారు. 2003లో ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందిన ఈమె పొద్దుటూరు ఎరుకలయ్య ఆశ్రమంలో చేరారు. ఆ తరువాత 2012లో ఎపీపీఎస్సీ ద్వారా పోటీ పరీక్ష రాసి సంస్కృత లెక్చరర్‌గా ఉద్యోగాన్ని సాధించారు. పలు చోట్ల అధ్యాపకురాలిగా పని చేశారు. తాజాగా పులివెందుల వైఎస్‌వీఆర్‌ఎం జూనియర్ కళాశాలలో పని చేస్తున్నారు. పిల్లలకు సంస్కృతంపై పట్టుసాధించడంతోపాటు పాఠ్యపుస్తక రచయితగా సేవలందించారు..
Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రిచే పురస్కారం...
డాక్టర్ పెద్దిరెడ్డి. నీలవేణి...
అన్నమయ్య జిల్లా నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి ప్రాథమిక విద్యను మైదుకూరు మండలం లక్ష్మిపేటలో, 6,7 తరగతులను నందిమండలం జెడ్పీ హైస్కూల్లో చదివింది. 8 నుంచి 10వ తరగతి వరకు మైలవరం రెసిడెన్సియల్ స్కూల్లో చదివారు. తరువాత ఇంటర్‌ను కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిగ్రీని కడప ప్రభుత్వ కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.. పీజీ, పిహెచ్‌డీలను తిరుపతి వెంకటేశ్వర యూనివర్సీటీలో పూర్తి చేసింది. 1995లో సెకెండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై న ఈమె అమ్మయ్యగారిపల్లెలో ఉద్యోగంలో చేరింది. 2012లో లెక్చరర్‌గా ఎంపికైంది. సాహిత్య పరంగా కూడా ఈమెకు మంచి పట్టుంది. వండర్ బుక్ ఆఫ్ అవార్డు, యునెస్కో వారి గౌరవ డాక్టర్‌తో పాటు పలు సాహిత్య కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.