Skip to main content

Best Teacher Awards: ఉత్త‌మ ఉపాధ్యాయుల‌కు విద్యాశాఖ మంత్రిచే పురస్కారం...

త‌మ విద్యను పలు విద్యార్థుల‌కు అందించి, విద్యార్థుల‌ను అన్ని రంగాల‌లో ముందుకు వెళ్ళేందుకు ప్రోత్సహింస్తున్న ఉపాధ్యాయులంద‌రికీ విద్యాశాఖ మంత్రి చేత ఉత్త‌మ ఉపాధ్యాయులుగా పుర‌స్కారం అందుకుంటున్న వారు వీరే...
national teachers day celebrations
national teachers day celebrations

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజున గురుపూజోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఆయన నడయాడిన.. ఉప కులపతిగా సేవలందించిన ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ఈ ఏడాది ప్రత్యేకత. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరం వేదికగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.

Best Teacher Award 2023: విద్య‌ను అందిస్తూ... ఉత్త‌మ ఉపాధ్యాయురాలిగా పుర‌స్కారం పొందింది.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిఽథిగా హాజరై రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరిస్తారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. దేవరాపల్లి మండలం కాశీపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్న కొట్టాన రాంబాబు, చీడికాడ మండలం మంచాల మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చరకాపు వెంకటలక్ష్మి, అచ్యుతాపురం మండలం నునపర్తి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కేజీయారాణి ఈ అవార్డులు అందుకోనున్న విషయం తెలిసిందే.

National Teachers Day: ఉత్తమ ఉపాధ్యాయులుగా 28మంది

వీరు కాకుండా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ప్రిన్సిపాల్‌ కె.అన్నపూర్ణ, ఇంగ్లిష్‌ బోధనలో కశింకోట మండలం వెదురుపర్తి జెడ్పీ హైస్కూల్‌ టీచర్‌ కంటిమహంతి సబిత లక్ష్మి రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు.

Published date : 05 Sep 2023 03:52PM

Photo Stories