Best Teacher Award 2023: విద్యను అందిస్తూ... ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం పొందింది.
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె.అన్నపూర్ణ ఎంపికయ్యారు. గత ఐదేళ్లుగా తను పనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడంతో ప్రభుత్వం ఆమెను రాష్ట ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు.
National Teacher's Day: సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకల్లో ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. గతంలో ఆమె ఆలిండియా రేడియోలో కేరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో విద్యార్థుల కోసం సర్వేజన ఫౌండేషన్ నిర్వహించిన ప్రత్యేక ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొని సులభ పద్ధతిలో పలు పాఠ్యాంశాలను బోధించారు.
Best Teacher Awards 2023: ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
బెంగళూర్‌లో బాలల హక్కులపై జరిగిన సెమీనార్‌లో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ విద్యా విధానంపై నిర్వహించిన తరగతుల్లో ఈమె ట్రైనర్‌గా వ్యవహరించారు. విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకోవడంలో తోడ్పడినందుకు గత ఏడాది కస్తూర్భా పాఠశాలల పరిధిలో రాష్ట స్థాయి సావిత్రిబాయి పూలే అవార్డు అందుకున్నారు. వీటన్నింటిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.