Skip to main content

Applications: ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఇదే

Applications For Best Teacher Award

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు కనీసం 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు.

ఎటువంటి అభియోగాలు, నేరారోపణలు లేనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే ఎటువంటి క్రిమినల్‌, సివిల్‌ కేసులు లేవని తనిఖీ అధికారులు తప్పనిసరిగా ధ్రువీకరించే పత్రం జత చేయాలని కోరారు.

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ టూ బీటెక్‌ అభ్యర్థుల కోసం మెగా జాబ్‌మేళా

అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తి చేసి ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఉప తనిఖీ అధికారి ఉర్దూ రేంజ్‌ కార్యాలయాల ద్వారా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు పంపాలని కోరారు.

Published date : 22 Aug 2024 10:55AM

Photo Stories