Employment Courses: యువకులకు శిక్షణతో ఉపాధి అవకాశం.. ఇలా..!
అనకాపల్లి: డిగ్రీలు, పీజీలు చేసినా సరైన స్కిల్ లేక ఉద్యోగం, ఉపాధి దొరక్క దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మధ్యలో చదువు ఆపేసిన వారు... నిరుత్సాహం పడాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వివిధ ట్రేడ్‌ల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తోంది. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో 2009 జూలై 1న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంత యువకుల ఉపాధి కల్పనకు బాటలు వేస్తోంది. సంస్థ ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇస్తోంది.
Social Welfare Hostels: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ప్రోత్సాహించాలి..
శిక్షణ అనంతరం వారు కోరుకున్న బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తూ స్వయం ఉపాధి కల్పిస్తోంది. ఈ సంస్థకు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. 18–45 సంవత్సరాల మధ్య వయస్సుగల గ్రామీణ నిరుద్యోగులను మాత్రమే ఎంపిక చేసుకుని వివిధ ట్రేడుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. సంస్థను ప్రారంభించి నాటి నుంచి నేటి వరకూ 9,031 మందికి శిక్షణ ఇచ్చారు. ఆయా వృత్తులలో నైపుణ్యం సాధించిన 7,590 మందికి బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేశారు. ముద్రా పథకం కింద ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పించారు.
Girls Gurukul Admissions: బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
2024–25 సంవత్సరంలో నేటికి ఐదు బ్యాచ్‌ల్లో 136 మంది శిక్షణ పొందగా, నేటికి 24 మందికి ఉపాధి కలిగింది. ఈ ఏడాది మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శిక్షణ కాలంలో ఒక్క రూపాయి కూడా సంస్థ తీసుకోకుండా ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బీఐ, ఆర్‌ఎస్‌ఈటీఐ) ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పోటీ ప్రపంచంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని శిక్షకులు చెబుతున్నారు.
Visakhapatnam Port: అరుదైన ఘనత సాధించిన విశాఖ పోర్టు.. అది ఏమిటంటే..
ఉపాధి శిక్షణ
శిక్షణ స్వల్పకాలమే... సొంత కాళ్లపై ఎదిగేలా తర్ఫీదు ఇస్తోంది. స్వయం ఉపాధి పొందేలా మార్గం చూపిస్తోంది. చేతిలో పట్టా ఉన్నా కొలువు దొరకని వారికి దర్జాగా బతికేలా భరోసా కల్పిస్తోంది. ఇలా ఎంతోమంది జీవితాల్లో ఉపాధి వెలుగులు నింపుతున్న ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ గ్రామీణ నిరుద్యోగులకు వరంగా మారింది.
Telangana Medical Jobs 2024 : 5348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలోనే..!
శిక్షణ వివరాలు
1. ఉమెన్స్ టైలరింగ్ 30 రోజులు
2. బ్యూటీ పార్లర్ 30 రోజులు
3. ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ 30 రోజులు
4. జ్యూట్ బ్యాగ్‌ల తయారీ 13 రోజులు
5. అగరబత్తి తయారీ 10 రోజులు
6. కొవ్వొత్తుల తయారీ 10 రోజులు
7. అప్పడాలు, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయారీ 10 రోజులు
NMMS Results: ఎన్‌ఎంఎంఎస్ ఫలితాలు విడుదల.. త్వరలో మెరిట్ కార్డుల పంపిణి!
8. పుట్టగొడుగుల పెంపకం 10 రోజులు
9. పాడిపశువు, వానపాముల పెంపకం 10 రోజులు
10. సెల్‌ఫోన్ రిపేరింగ్ 30 రోజులు
11. ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ 30 రోజులు
12. టూవీలర్ మెకానిజమ్ 30 రోజులు
13. హౌస్ వైరింగ్ 30 రోజులు
14. ఎల్.ఎం.వి.డ్రైవింగ్ 30 రోజులు
15. ఏసీ, ఫ్రిజ్‌ల సర్వీసింగ్ 30 రోజులు
16. మెన్స్ టైలరింగ్ 30 రోజులు
17. కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ 30 రోజులు
Gurukul Schools: ఈనెల 15వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు..
ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాను. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కారణంగా స్వయం శక్తిపై ఎదగాలని ఆశతో ఉన్నాను. నాకు ఇష్టమైన బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాను. ఉచిత శిక్షణతోపాటు వసతి భోజనం కల్పిస్తారని నా స్నేహితురాలు చెప్పడంతో ఇక్కడ చేరాను. శిక్షణ అనంతరం సంస్థ ద్వారా మా ఇంటికి దగ్గరలో బ్యాంకు రుణం తీసుకుని బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుంటాను.
– ఎ.హరిక, మత్స్యపురం గ్రామం, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా
Tags
- Employment opportunity
- coaching classes
- Unemployed Youth
- various courses
- Intermediate Students
- graduates and post graduate students
- self employment
- Free training
- Eligible students
- Academic year
- SBI Rural Self Employed Training Institute
- Education News
- Sakshi Education News
- anakapalle district news
- skill trainings
- career growth
- free trainings