Skip to main content

GO4Youth Olympiad 2024: గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ 2024, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

GO4Youth Olympiad 2024

గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ 2024 తేదీలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా  GO4Youth Olympaid నిర్వహిస్తున్నట్లు యూజీసీ వెల్లడించింది. 18-25 ఏళ్లలోపు వయసు ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ (GO4Youth) ఎగ్జామ్‌కు రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

విజేతలకు నగదు బహుమతులతో పాటు ఈ-సర్టిఫికేట్స్‌ కూడా పొందవచ్చు. అంతేకాకుండా TERI యూత్‌ నెట్‌వర్క్‌లో సభ్యత్వం,ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (TERI)తో పాటు ఇతర ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కూడా లభిస్తుంది. 

GO4Youth 2024 ముఖ్యమైన తేదీలివే:

రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 25, 2024
పరీక్ష తేది: 8-12 ఏప్రిల్‌, 2024
పరీక్ష సమయం: 60 నిమిషాలు
నెగిటివ్‌ మార్కింగ్‌: లేదు
మొత్తం ప్రశ్నలు: 50
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ విధానం
దరఖాస్తు ఫీజు: రూ. 160/

మరిన్ని వివరాలకు  https://www.teriin.org/olympiad/index.php ను సంప్రదించండి. 

 

 

Published date : 19 Feb 2024 04:29PM

Photo Stories