Skip to main content

Heavy Rain : కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో ఇవాళ‌, రేపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. మ‌రో రెండు రోజులు పాటు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న ప‌లు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ap schools and colleges holidays

ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ‌ప‌ట్నం, వైఎస్సార్ క‌డ‌ప‌, అన్న‌మ‌య్య‌  జిల్లాల్లో కురు­స్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జల­మ­య­మయ్యాయి. ఈ జిల్లాల క‌లెక్ట‌ర్లు నేడు, రేపు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

తిరుప‌తిలో..
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీ­మీ­టర్ల వర్షం కురిసింది. తిరు­పతి జిల్లా పెళ్లకూ­రులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. ఈ జిల్లా క‌లెక్ట‌రు నేడు, రేపు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.

నెల్లూరు..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీరప్రాంతం అతలాకుతలమైంది. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్‌ బ్రిడ్జిలు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ జిల్లా క‌లెక్ట‌రు నేడు, రేపు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది. శివారు కాలనీలు నీట మునిగాయి. కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ..

holidays news

బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఈ మూడు జిల్లాల్లో వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బాపట్ల, అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె తదితర ప్రాంతాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాలోఇకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో మంగళవారం కోస్తా తీరమంతా తీవ్రమైన గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లా క‌లెక్ట‌రు నేడు, రేపు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది. ఈ జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు నేడు, రేపు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.

ఈ 60 గ్రామాలకు రాకపోకలు బంద్‌..
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పలు గ్రామాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో పిట్టవారిపల్లె వద్ద రొయ్యల చెరువులో ఐదుగురు కూలీలు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో వారిని రక్షించారు.

ప్రమాదం జరగకుండా.. 
చిళ్లకూరు మండలంలోని తిప్పగుంట పాళెం వద్ద ఉప్పుటేరు ఉదృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సత్యవేడు నియోజకవర్గంలోనూ 40కి పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు పదుల సంఖ్యలో నేలకొరిగాయి. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. తిరుపతి జిల్లాలో పొలాల్లా వరి పంట నీట మునిగింది. కాళంగి, మల్లెమడుగు, కళ్యాణిడ్యామ్‌లు, స్వర్ణముఖి, సదాశివకోన, అరణియార్‌ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోగా ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేశారు.

స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకట్ట దెబ్బతినకుండా జేసీబీల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు మరమతులు చేస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీకాలనీలో ఆదివారం గోడ కూలి యశ్వంత్‌ అనే బాలుడు మృతి చెందగా తక్షణమే స్పందించిన రెవెన్యూ అధికారులు రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించారు. చలి గాలులకు తట్టుకోలేక సోమవారం వాకాడు మండలం గొల్లపాళెం గ్రామానికి చెందిన బందిల పొండమ్మ (63) అనే వృద్ధ మహిళ మృతి చెందింది. నాగలాపురం మండలం కొట్తకాడు గ్రామంలో సంధ్య అనే మహిళకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పురిటినొప్పులు వచ్చాయి.

అయితే తీవ్ర వర్షాల వల్ల ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయాయి. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు ఆమెను చేతులతో మోసుకొని వాగు దాటించారు. నగరి నియోజకవర్గ పరిధిలోని కుశస్థలి ఉధృతంగా ప్రవహిస్తోంది.  కార్వేటి నగరం మండలంలోని క్రిష్ణాపురం జలాశయంకు అధికంగా వరద నీరు చేరుతోంది. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం గేటు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

అలల ధాటికి పాకల సముద్ర తీరం కోతకు గురైంది. పడవలు, వలలు ఇతర సామాగ్రి సైతం జాగ్రత్త చేసుకునేలా మత్స్యకారులకు అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లాలో తుపాన్‌ కారణంగా సముద్రంలో అలజడి రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి తీరంవైపు చొచ్చుకువచ్చాయి. చీరాల, బాపట్ల, నిజాంపట్నం తీరంలో సముద్రం కొంతమేర ముందుకు వచ్చింది. ఈదురు గాలులు పెరిగాయి. చీరాల, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సోమవారం సాయంత్రానికి వర్షం పెరిగింది.  

బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం..
మిచాంగ్‌ తుపాను గత ఆరు గంటలుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు ఆగ్నేయ దిశలో 250 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా దక్షిణ ఏపీ తీర ప్రాంతాలైన నెల్లూరు, మచిలీçపట్నానికి సమాంతరంగా ప్రయాణిస్తూ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది.

అందుకనుగుణంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఏపీఎస్‌డీపీఎస్‌ (ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ సొసైటీ) అధికారులు జిల్లాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కాగా, తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ సోమవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రైల్వేకోడూరులో మాత్రం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రేణిగుంట ప్రధాన రహదారిలో శేషాచల అడవుల నుంచి భారీగా వచ్చిన వరద నీరు రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. మామిడి, అరటి, బొప్పాయి తోటల్లో వర్షపు నీరు నిలిచింది.

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. పూసపాటిరేగ మండలం చింతపల్లి రేవులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. బోట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం రాత్రి నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

దెబ్బతిన్న కాకినాడ–ఉప్పాడ బీచ్‌రోడ్డు
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ–ఉప్పాడ బీచ్‌రోడ్డు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. కెరటాలు బీచ్‌రోడ్డుపైకి దూసుకు వస్తుండడంతో రక్షణగా వేసిన బండరాళ్లు సైతం పక్కకు కదిలిపోతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ట్రాఫిక్‌ను ఉప్పాడ నుంచి పిఠాపురం మీదుగా మళ్లించారు. సోమవారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. ఈదురు గాలుల ప్రభావం వల్ల పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురవ్వగా పలువురు మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి.

సముద్రతీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్‌ రక్షణగోడ సైతం కెరటాల ఉధృతిని ఆపలేక ధ్వంసమైంది. పలుచోట్ల అండలు జారడంతో సముద్రపునీరు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. కెరటాలతోపాటు రాళ్లు ఎగిరి పడుతుండడంతోపాటు బీచ్‌ రోడ్డు కోతకు గురైంది. తీరంలో కెరటాలు సుమారు 8 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి పోలీసు, రెవిన్యూ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. 
 
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మిచాంగ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచించింది. తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.

తెలంగాణ‌లో కూడా..
ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, నాగర్‌ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉందని పేర్కొంది. 

➤ School Holidays List December 2023 : స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు.. బ్యాంకులకు 14 రోజులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

whatsapp group

☛ కింది లింక్‌ను క్లిక్ చేయండి

☛ Link: www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k (Click Here)

Published date : 05 Dec 2023 10:22AM

Photo Stories