Hindi Language Day: హిందీ భాషా ఉత్సవాం సందర్భంగా పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: హందీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న హిందీ భాషా ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. నరసరావుపేట డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి కె.వేణుగోపాలరావు పోటీలను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయినీ ఎం.పార్వతి పర్యవేక్షణలో నిర్వహించిన పోటీలలో జిల్లాలోని 15మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రథమ బహుమతి, 75 తాళ్లూరు పాఠశాల, వి.రెడ్డిపాలెం పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించారు. విజేతలైన విద్యార్థులకు ఈనెల 14వ తేదీన నిర్వహించే హిందీ దివస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి చేతుల మీదగా బహుమతులు అందజేస్తారని తెలిపారు.
Medical College: కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పరిశీలన
క్యారమ్స్‌లో పల్నాడు జిల్లాకు ప్రథమస్థానం
ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్ల ఎంపికలు, క్రీడాకారులకు పోటీలు ఈనెల ఎనిమిది నుంచి 11వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన మండలంలోని నార్నెపాడు పాఠశాల ఉపాధ్యాయుడు కాళ్ల వెంకటేశ్వర్లు(ఎస్‌ఏ, బయలాజికల్‌సైన్స్) రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం సాధించారు. జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ జాతీయస్థాయి పోటీలు 2024 ఫిబ్రవరి నెలలో బీహార్‌లో జరగనున్నాయి. పోటీలకు కాళ్ల వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వెంకటేశ్వర్లును పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.