Medical College: కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పరిశీలన
Sakshi Education
ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న వైద్య కళాశాల కోసం జరిగే ఏర్పాట్లను ఎమ్మెల్యే, ప్రిన్సిపాల్ లు పరిశీలించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సాక్షి ఎడ్యుకేషన్: వైద్యకళాశాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రిన్సిపాల్ నాగార్జున చారితో కలిసి మంగళవారం పరిశీలించారు.
Medical College Inauguration: మెడికల్ కళాశాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ విధానంలో వైద్య కళాశాలలను ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంజినీరింగ్, వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ నెల 15 నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
Published date : 14 Sep 2023 11:26AM